టాలీవుడ్ లో అనూహ్య పరిణామం.. ఎన్నికైన 24 గంటల్లోనే అధ్యక్ష పదవికి సునీల్ రాజీనామా!
Sun Jun 08, 2025 22:09 Politics
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ - టీఎఫ్‌సీసీ) అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ అనూహ్యంగా రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికై, బాధ్యతలు స్వీకరించిన 24 గంటలు కూడా గడవకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌సీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సునీల్ నారంగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా శ్రీధర్‌తో పాటు మరో 15 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ, థియేటర్ల విషయంలో తరచూ వినిపించే "ఆ నలుగురు" అనే ప్రస్తావనలో వాస్తవం లేదని, థియేటర్లు వాటి యజమానుల వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, "హీరోలు దేవుళ్ళతో సమానం.
ఇది కూడా చదవండి: కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!
వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత చేయరు" అని వ్యాఖ్యానించారు. అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ, "ఆయన ఒక తుపాను లాంటి వారు, ఆయన సినిమాను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు" అని అన్నారు. అయితే, ఇంతలోనే అనూహ్యంగా ఆదివారం ఉదయం సునీల్ నారంగ్ తన రాజీనామాను ప్రకటించారు. తనను సంప్రదించకుండానే కొందరు వ్యక్తులు ప్రకటనలు జారీ చేస్తున్నారని, తన ప్రమేయం లేకుండా వెలువడుతున్న అలాంటి ప్రకటనలకు తాను ఎలాంటి బాధ్యత వహించబోనని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను అధ్యక్ష పదవిలో కొనసాగలేనని పేర్కొంటూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఒక్క రోజులోనే చోటుచేసుకున్న ఈ నాటకీయ పరిణామాలు టీఎఫ్‌సీసీ వర్గాల్లోనూ, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Sunil Narang #TFCC #Telangana Film #Chamber of Commerce #Tollywood #Telugu Film Industry #Pawan Kalyan #Film Chamber #Elections #Telugu Cinema #Movie Theaters #Producer Distributor
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.